big stars
-
ఆ మాటే నాకు నచ్చదు: రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh About Working With Amitabh Bachchan Ajay Devgn: టాలీవుడ్లో అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫిట్నెస్ బ్యూటీ నటించిన తాజా హిందీ చిత్రం 'రన్ వే 34'. ఈ మూవీలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీకి అజయ్ దేవగణ్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విశేషాలను ఇటీవల పంచుకుంది రకుల్. ఈ క్రమంలో రకుల్‌ను ఒకేసారి ఇద్దరు పెద్ద స్టార్లతో పని చేయడం నటిగా కష్టమనిపించిందా ? అని ప్రశ్నించగా ఆసక్తికర సమధానం ఇచ్చింది. నిజానికి కష్టం అనే మాటే నాకు అస్సలు నచ్చదు. నాకంటే ప్రతిభావంతులైన నటులతో కలిసి పనిచేస్తున్నప్పుడు నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇక ఇద్దరు పెద్ద స్టార్లతో కలిసి నటిస్తున్నాన్నంటే ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. ఎందుకంటే నేను మరింత మెరుగ్గా, బెస్ట్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ ఛత్రివాలీ, డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: ఆ స్టార్ హీరోకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ? -
‘స్టార్’ అనిపించుకోవడంలో మజా ఏం ఉంటుంది?
నా మటుకు నాకు స్టార్ హీరోయిన్ అనిపించుకోవడంకన్నా ‘మంచి ఆర్టిస్ట్’ అనిపించుకోవడమే ఇష్టం. స్టార్ అనిపించుకోవడంలో మజా ఏముంటుంది? భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తే, ఆ హోదా దక్కుతుంది. ‘స్టార్’ అనిపించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ, గొప్ప నటి అనిపించుకోవడానికి మాత్రం చాలా కష్టపడాలి. బలమైన పాత్రలు చేయాలి. అలాంటి పాత్రలవైపే మొగ్గు చూపుతున్నా. కథాబలం ఉన్న చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా. నిర్మాతగా నా తొలి చిత్రం ‘ఎన్‌హెచ్ 10’ కూడా కథాబలం ఉన్నదే. ఇందులో నా పాత్ర కూడా చాలా శక్తిమంతంగా ఉంటుంది. అందుకే అందరి ప్రశంసలూ అందుకుంటోంది. ఏదో వచ్చామా? రెండు పాటలకు డాన్స్ చేశామా? హీరోతో రొమాంటిక్ సీన్స్ చేశామా? అనే తరహా పాత్రలు చేస్తే, పెద్దగా ప్రశంసలు లభించవు. భవిష్యత్తులో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ‘ఫర్వాలేదు.. మనం గొప్ప పాత్రలే చేశాం’ అనే సంతృప్తి మిగలాలి. అందుకే, పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నా. కథ నచ్చితే చాలు హీరో, బేనర్.. ఏదీ ఆలోచించను. కళ్లు మూసుకుని సినిమా ఒప్పేసుకుంటా. - అనుష్క శర్మ, కథానాయిక