‘స్టార్’ అనిపించుకోవడంలో మజా ఏం ఉంటుంది? | NH10's leading lady Anushka Sharma prefers good scripts over big stars | Sakshi
Sakshi News home page

‘స్టార్’ అనిపించుకోవడంలో మజా ఏం ఉంటుంది?

Published Wed, Mar 18 2015 11:05 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

‘స్టార్’ అనిపించుకోవడంలో మజా ఏం ఉంటుంది? - Sakshi

‘స్టార్’ అనిపించుకోవడంలో మజా ఏం ఉంటుంది?

 నా మటుకు నాకు స్టార్ హీరోయిన్ అనిపించుకోవడంకన్నా ‘మంచి ఆర్టిస్ట్’ అనిపించుకోవడమే ఇష్టం. స్టార్ అనిపించుకోవడంలో మజా ఏముంటుంది? భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తే, ఆ హోదా దక్కుతుంది. ‘స్టార్’ అనిపించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ, గొప్ప నటి అనిపించుకోవడానికి మాత్రం చాలా కష్టపడాలి. బలమైన పాత్రలు చేయాలి. అలాంటి పాత్రలవైపే మొగ్గు చూపుతున్నా. కథాబలం ఉన్న చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా. నిర్మాతగా నా తొలి చిత్రం ‘ఎన్‌హెచ్ 10’ కూడా కథాబలం ఉన్నదే. ఇందులో నా పాత్ర కూడా చాలా శక్తిమంతంగా ఉంటుంది.  అందుకే అందరి ప్రశంసలూ అందుకుంటోంది.
 
  ఏదో వచ్చామా? రెండు పాటలకు డాన్స్ చేశామా? హీరోతో రొమాంటిక్ సీన్స్ చేశామా? అనే తరహా పాత్రలు చేస్తే, పెద్దగా ప్రశంసలు లభించవు. భవిష్యత్తులో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ‘ఫర్వాలేదు.. మనం గొప్ప పాత్రలే చేశాం’ అనే సంతృప్తి మిగలాలి. అందుకే, పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నా. కథ నచ్చితే చాలు హీరో, బేనర్.. ఏదీ ఆలోచించను. కళ్లు మూసుకుని సినిమా ఒప్పేసుకుంటా. - అనుష్క శర్మ, కథానాయిక
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement