ఒక్కరా? ఇద్దరా? | Shankar and Kamal Haasan's Bharateeyudu 2 | Sakshi
Sakshi News home page

ఒక్కరా? ఇద్దరా?

Sep 4 2018 1:56 AM | Updated on Sep 4 2018 1:56 AM

Shankar and Kamal Haasan's Bharateeyudu 2 - Sakshi

కమల్‌ హాసన్‌– శంకర్‌ కాంబినేషన్‌లో ‘ఇండియన్‌’ (తెలుగులో భారతీయుడు) సీక్వెల్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, లొకేషన్స్‌ వెతికే పనుల్లో శంకర్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌ లేటెస్ట్‌ న్యూస్‌ ఏంటంటే ఈ సీక్వెల్‌లో కమల్‌హాసన్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపిస్తారట. ఏయం రత్నం నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం వచ్చే ఏడాదిలో స్టార్ట్‌ కానుంది.

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్‌ పార్ట్‌లో తండ్రీ, కొడుకుల్లా రెండు పాత్రల్లో కనిపించిన కమల్, సినిమా చివరలో లంచగొండి అయిన కొడుకుని చంపేస్తాడు. మరి సీక్వెల్‌లో డ్యూయల్‌ రోల్‌ ఎలా తీసుకువస్తారన్నది చర్చనీయాంశం. ఏది చేసినా లాజిక్‌లకి లోబడి ఉండే శంకర్‌ దానికి మించిన స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్నారని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement