
బాలీవుడ్ నటి కాజోల్ పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలుగా తనదైన నటనతో అలరించింది. ఆమె అందానికి దాసోహం కానివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కానీ గత కొన్ని రోజులుగా ఆమెపై కొంతమంది నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. కాజోల్ తాజాగా ముంబయిలో తన భర్త నటించిన చిత్రం 'భోలా' ప్రీమియర్ షోకు హాజరైంది.
(ఇది చదవండి: కాజోల్ అందంపై ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్)
ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన కాజోల్ తెల్లటి కోటుతో పాటు డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. ఆమె వెంట కొడుకు యుగ్, తల్లి తనూజ, భర్త అజయ్ దేవగన్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కాజోల్ డ్రెస్‌పై కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన కొందరైతే కాజోల్ మరింత అందంగా కనిపిస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. చాలామంది ఆమె లుక్, నడకపై ట్రోల్స్ చేశారు. ఆమె దుస్తులతో పాటు నడక మరింత విచిత్రంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా కాజోల్ ప్రస్తుతం గర్భవతినా? అంటూ కామెంట్స్ చేశారు. అయితే గతంలోనూ కాజోల్ ముఖానికి సర్జరీ చేయించుకున్నారని ట్రోలింగ్స్ ఎదురయ్యాయి.
#Kajol ♥️#jdreturnz pic.twitter.com/2vzI0SzcX8
— JDReturnz (@JdReturnz) March 30, 2023
Comments
Please login to add a commentAdd a comment