
‘‘అవును... నిజమే. ‘రైడ్’ మూవీకి అజయ్ నన్ను రిఫర్ చేశాడు. ‘ముబారక్’ సినిమాలో నా కో–స్టార్ అర్జున్ కపూర్ కూడా ఓ సినిమా స్క్రిప్ట్‌ను పరిశీలించమన్నాడు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా. అయినా వరుసగా రెండు సినిమాలు ఒక హీరో పక్కన చేస్తే చాలు.. ఏవేవో పుకార్లు పుట్టిస్తుంటారు. అవన్నీ నిజం కావు’’ అంటున్నారు ఇలియానా. ఇంతకీ మేటర్ ఏంటంటే... బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన 2016లో ‘బాద్‌షాహో’, ఈ ఏడాది ఈ నెలలో రిలీజ్ కానున్న ‘రైడ్’ చిత్రాల్లో కథానాయిక నటించారు ఇలియానా.
ప్రస్తుతం ఇంద్రకుమార్ దర్శకత్వంలో ‘ధమాల్’ ఫ్రాంచైజీ ‘టోటల్ ధమాల్ 3’లో నటిస్తున్నారు అజయ్. ఈ సినిమాలో ఇలియానా ఓ ముఖ్య పాత్ర షోషించేలా అజయ్ పావులు కదుపుతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై ఇలియానా స్పందిస్తూ– ‘‘టోటల్ ధమాల్’ చిత్రంలో నటించమని నన్నెవరూ సంప్రదించలేదు. ఈ సినిమాకి అజయ్ నన్ను రికమండ్ చేశాడని వస్తున్న వార్తలు నిజం కావు. ఇలాంటివి విన్నప్పుడు ఫన్నీగా ఉంటుంది. ప్రచారంలో ఉన్నట్లుగా అజయ్‌తో నాకెలాంటి సంబంధం లేదు. ఒకరి గురించి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారో అర్థం కావడం లేదు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment