వెరైటీ లుక్‌ | First Look Of Ileana From The Big Bull Release | Sakshi
Sakshi News home page

వెరైటీ లుక్‌

Published Wed, Aug 19 2020 2:25 AM | Last Updated on Wed, Aug 19 2020 2:25 AM

First Look Of Ileana From The Big Bull Release - Sakshi

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో రూపొందిన క్రైమ్‌ డ్రామా ‘ది బిగ్‌ బుల్‌’. అభిషేక్‌ బచ్చన్, ఇలియానా జంటగా కూకీ గులాటి దర్శకత్వం వహించారు. అజయ్‌ దేవ్‌గన్, ఆనంద్‌ పండిట్‌ నిర్మించిన ఈ సినిమాకి సంబంధించిన ఇలియానా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. కళ్ల జోడు, టైట్‌గా ముడివేసిన జుట్టుతో ఇలియానా లుక్‌ వెరైటీగా ఉంది. ఈ చిత్రం త్వరలో డిస్నీ హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది. ‘‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఇలియానా. 1980, 1990లలో ముంబైలో జరిగిన వాస్తవ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని, పలు ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ స్టాక్‌ బ్రోకర్‌కు సంబంధించి కథ ఇదని సమాచారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement