
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైదాన్’. ఇందులో ప్రియమణి కథానాయిక. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని అజయ్ లుక్స్‌ను గురువారం విడుదల చేశారు. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ కమ్ మేనేజర్ (1950–1963) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ‘మైదాన్’ చిత్రం రూపొందుతోంది. ఏప్రిల్‌కి చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నవంబరు 27న ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment