
అజయ్ దేవగన్
అజయ్ దేవగన్ రీల్ ఫుట్‌బాల్ మ్యాచ్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. హైదరాబాద్‌కి చెందిన ఫుట్‌బాల్ కోచ్ కమ్ ప్లేయర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఇటీవలే ‘బదాయి హో’ చిత్రంతో మంచి సక్సెస్ సాధించిన అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తారు. ‘‘అజయ్ గ్రేట్ లిజనర్. ఎమోషనల్ సీన్‌లో అజయ్ దేవగన్ అద్భుతంగా నటిస్తారు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెడతాం. మన దేశంలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ ఫుట్‌బాల్‌కి లేదు. కానీ మన దేశంలో ఫుట్‌బాల్ క్రీడకు సయ్యద్‌గారు చాలా కృషి చేశారు. అయినప్పటికీ ఆయన పేరుపై ఒక్క స్టేడియం కూడా లేదు. ఈ సినిమా తర్వాత అయినా ఆయనకు సరైన గౌరవం దక్కుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు అమిత్.
Comments
Please login to add a commentAdd a comment