ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే? | Ajay Devgan as the highest paid Indian actor in OTT this Year | Sakshi
Sakshi News home page

ఓటీటీల్లోకి స్టార్స్ ఎంట్రీ.. అత్యధిక రెమ్యునరేషన్ ఆ హీరోకే!

Published Sun, Dec 31 2023 12:21 PM | Last Updated on Sun, Dec 31 2023 1:44 PM

Ajay Devgan as the highest paid Indian actor in OTT this Year - Sakshi

సినీ ప్రేక్షకులు ఇప్పుడంతా ఎక్కువగా ఓటీటీలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎప్పటికప్పుడు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లో చూసేందుకే అభిమానులు మొగ్గు చూపుతున్నారు. దీంతో థియేటర్​ ఆడియెన్స్‌తో పాటు నెటిజన్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు సైతం ఓటీటీ సినిమాలు, వెబ్​ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే నాగచైతన్య సైతం దూత అనే వెబ్‌ సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చేశారు. కాగా.. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, తమన్నా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సోనాక్షి సిన్హా, సమంత, రాశీఖన్నా, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్​ సైతం ఓటీటీ వేదికలపై మెరిశారు. 

అయితే ఓటీటీల్లో నటించేందుకు అగ్రతారలు పారితోషికం గట్టిగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఏ పాత్రలోనైనా సరే నటించడానికి రెడీ అంటున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్ ఓటీటీలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 2022లో డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో ప్రసారమైన క్రైమ్ థ్రిల్లర్ షో 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్'తో అజయ్ ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం ఓటీటీల్లో నటించిన స్టార్స్ పరంగా చూస్తే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు అజయ్ దేవగన్ అని లేటెస్ట్. 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్' 7 ఎపిసోడ్‌ల కోసం దాదాపు రూ.125 కోట్లు పారితోషికం తీసుకున్నారని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన ఒక్క ఎపిసోడ్‌కు రూ. 18 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలా ఓటీటీలో అత్యధిక పారితోషికాన్ని అందుకున్న భారతీయ నటుడిగా అజయ్ నిలిచారు. ఆ తర్వాత మరో నటుడు మనోజ్ భాజ్‌పేయి నిలిచారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన  'ది ఫ్యామిలీ మ్యాన్' క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో ఆయన నటించారు. ఈ సిరీస్ రెండవ సీజన్‌లో మనోజ్ ఏకంగా రూ. 10 కోట్ల వరకు తీసుకున్నారని టాక్.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement