వాళ్లిద్దరితో బంధానికి పేరు లేదు : టబు | Tabu Says She Has Unconditional Relationship With Salman Khan Ajay Devgan | Sakshi
Sakshi News home page

‘సల్మాన్‌, అజయ్‌లను అమితంగా ప్రేమిస్తా’

Published Wed, May 15 2019 2:59 PM | Last Updated on Wed, May 15 2019 3:20 PM

Tabu Says She Has Unconditional Relationship With Salman Khan Ajay Devgan - Sakshi

వాళ్లిద్దరిని నేను అమితంగా ప్రేమిస్తా. మా అద్భుత బంధానికి ఫలానా అని పేరు పెట్టలేము.

సల్మాన్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు అని సీనియర్‌ నటి టబు పేర్కొన్నారు. వాళ్లతో తనకు ఉన్న అనుబంధానికి పేరు పెట్టలేమని వ్యాఖ్యానించారు. టబు సినీ రంగప్రవేశం చేసి దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గానే కాకుండా సహాయక పాత్రల్లో కూడా మెప్పించిన టబుకు ఇండస్ట్రీలో చాలా మందే స్నేహితులే ఉన్నారు. ఈ విషయం గురించి టబు మాట్లాడుతూ..‘ నా వృత్తిలో భాగంగా ఎంతో మందిని కలిశాను. అయితే సల్మాన్‌, అజయ్‌లతో నాకున్న అనుబంధం అన్నింటికన్నా అతీతమైంది. నా జీవితంలో ఎక్కువ భాగం వారితోనే కలిసి ఉన్నాను. కఠిన పరిస్థితుల్లో కూడా కుంగిపోకుండా ధైర్యంగా ఉండేలా వారిద్దరు నా వెన్నంటే ఉన్నారు. వాళ్లను కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తా’ అని ఆప్త మిత్రుల గురించి చెప్పుకొచ్చారు.

వాళ్లను అమితంగా ప్రేమిస్తా..
‘అజయ్‌, సల్మాన్‌లతో ఒక్కసారి స్నేహం చేస్తే ఎవరైనా సరే వారిని అంత తేలికగా వదులుకోలేరు. మనం చెప్పకుండానే మనసులోని భావాలను వాళ్లు అర్థం చేసుకోగలరు. అందుకే వాళ్లిద్దరిని నేను అమితంగా ప్రేమిస్తా. మా అద్భుత బంధానికి ఫలానా అని పేరు పెట్టలేము’ అని టబు అజయ్‌, సల్మాన్‌ ఖాన్‌పై ప్రశంసలు కురిపించారు. కాగా అజయ్‌ దేవగణ్‌ సినిమా విజయ్‌పథ్‌ సినిమాతో హీరోయిన్‌గా సక్సెస్‌ రుచి చూసిన టబు.. ఆ తర్వాత హకీకత్‌, తక్షక్‌, దృశ్యం, గోల్‌మాల్‌ తదితర సినిమాల్లో అతడితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం అజయ్‌తో కలిసి నటించిన దే దే ప్యార్‌ దే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సల్మాన్‌ సినిమాలు బీవీ నంబర్‌1, హమ్‌ సాథ్‌ సాథ్‌ హై, జైహో, భారత్‌ తదితర సినిమాల్లో టబు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement