
తమిళసినిమా: రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటుల చిత్రాల్లో బాలీవుడ్ స్టార్స్‌ను నటింపజేయడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కాంబినేషన్ కొత్తగా ఉంటుంది, వ్యాపారం అంతర్జాతీయ స్థాయిలో పలుకుతుందన్న ఆలోచనలే ఇందుకు కారణంగా భావించవచ్చు. బాలీవుడ్ స్టార్స్ కూడా దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్ కాలా చిత్రంలో తనకు విలన్‌గా నానాపటేకర్‌ను ఎంచుకున్నారు. ఇక ఎందిరన్ చిత్రంలో అక్షయ్‌కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కమలహాసన్ కూడా తన తాజా చిత్రం ఇండియన్–2లో మరో బాలీవుడ్ హీరో అజయ్‌దేవ్‌గన్‌ను నటింపజేసే ప్రయత్నంలో ఉన్నట్లు తాజా సమాచారం.
అయితే కమల్ తన హేరామ్ చిత్రంలోనే షారూఖ్‌ఖాన్‌ను నటింపజేశారన్నది గమనార్హం. ఆయన త్వరలో శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2లో నటించడానకి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 2.ఓ చిత్ర గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ సెప్టెంబర్‌లో ఇండియన్–2 చిత్రానికి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. ఆయన చిత్రాలు బ్రహ్మాండానికి మారుపేరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ తారాగణం, ప్రఖ్యాత సాంకేతిక వర్గం ఆయన చిత్రాల్లో పనిచేస్తుంటారు. అలా ఇండియన్–2ను భారీ ఎత్తున తెరకెక్కించడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే కమలహాసన్ సరసన అగ్రనటి నయనతార నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అజయ్‌దేవ్‌గన్‌ను ప్రధాన పాత్రల్లో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. దీనికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలు కడుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఎన్ని విశేషాలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నాయో.
Comments
Please login to add a commentAdd a comment