
‘తన్హాజీ’లో అజయ్ దేవగన్
బాలీవుడ్‌లో సెంచరీ కొట్టారు అజయ్ దేవగన్. సుమారు 30 ఏళ్ల యాక్టింగ్ కెరీర్‌లో అజేయంగా 100వ సినిమా మైలురాయిని టచ్ చేశారు. ప్రస్తుతం నటిస్తున్న ‘తన్హాజీ’ అజయ్ దేవగన్ కెరీర్‌లో 100వ సినిమా. 1991లో ‘పూల్ అవుర్ కాంటే’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు అజయ్. ‘‘30 ఏళ్లు.. వంద సినిమాలు. ఫూల్ అవుర్ కాంటే, గోల్‌మాల్, శివాయ్, ఇప్పుడు తన్హాజీ. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నిన్ను చూస్తూనే ఉన్నాను. వందో సినిమాకు శుభాకాంక్షలు అజయ్’’ అని ట్వీటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు నటి, అజయ్ దేవగన్ భార్య కాజోల్. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానున్న ‘తన్హాజీ’ సినిమాకు అజయ్ దేవగన్ ఒక నిర్మాత. ఈ సినిమాలో కాజోల్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment