బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ మల్హోత్రా నటించిన చిత్రం 'థ్యాంగ్ గాడ్' చిక్కుల్లో పడింది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగా.. అదే ఇప్పుడు సమస్యను తెచ్చిపెట్టింది. దర్శకుడు ఇంద్ర కుమార్ తెరకెక్కిస్తున్న ‘థ్యాంక్ గాడ్’ సినిమాపై న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ యూపీలోని జాన్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కేసు నమోదైంది. నవంబర్ 18న పిటిషనర్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు కోర్టు తెలిపింది.
(చదవండి: అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది: టబు)
ఇటీవల విడుదలైన 'థ్యాంక్ గాడ్' ట్రైలర్ ఓ మతం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ హిమాన్షు శ్రీవాస్తవ కోర్టుకు వివరించారు. ఓ సన్నివేశంలో అజయ్ దేవగణ్ సూటు ధరించి చిత్రగుప్తుని పాత్రలో జోకులు పేల్చడం, అభ్యంతరకరమైన పదజాలం కనిపించిందని శ్రీవాస్తవ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చిత్రగుప్తుడు మంచి, చెడులను లెక్కిస్తాడు. దేవుళ్లను ఇలా వర్ణించడం వల్ల ఓ మతం మనోభావాలను దెబ్బతీస్తుందని న్యాయవాది పిటిషన్‌లో వివరించారు. దీంతో అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర, దర్శకుడు ఇంద్ర కుమార్‌పై కేసు నమోదైంది. ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment