
ముంబై: బోనీ కపూర్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'మైదాన్'. ఫుట్‌బాల్ కథాంశం నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ముంబైలో మంగళవారం ప్రారంభమైంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభ వేడుకకు బోనీ కపూర్ కుటుంబం సహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. కానీ, బోనీ కపూర్-శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ మాత్రం కనిపించలేదు.
ఈ సినిమా పూజ కార్యక్రమంలో బోనీ కపూర్ తన పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా, ఖుషీతో కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఈ వేడుకకు జాన్వీ కపూర్ ఎందుకు హాజరుకాలేదన్న దానిపై వివరాలు తెలియదు. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల షూటింగ్ కారణంగా ఈ సినిమా పూజ కార్యక్రమానికి ఆమె రాలేకపోయారా? అన్నది తెలియదు. ఇక 1952 - 62 మధ్యకాలంలో భారత ఫుట్‌బాల్ క్రీడా వైభవాన్ని చాటేలా తెరకెక్కుతున్న ‘మైదాన్’లో అజయ్ దేవ్‌గణ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను పోషిస్తుండగా, కీర్తి సురేష్ మరో కీలక పాత్రలో నటించబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment