
పుల్వామా ఘటనలో మన జవాన్లు వీర మరణం పొందడం దేశాన్ని కుదిపేసింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ఘటనను ఖండించారు. వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు దేశ మొత్తం తోడుగా నిలిచింది. అయితే ఈ ఉగ్రదాడికి నిరసనగా ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే పాకిస్తాన్‌కు చెందిన నటీనటులను బ్యాన్ చేసింది. తమ సినిమాల్లో పాక్ నటీనటులను తీసుకోడానికి వీల్లేదంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది. తాజాగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తన ‘టొటల్ ధమాల్’ను పాకిస్థాన్‌లో విడుదల చేయడం లేదంటూ ప్రకటించారు. అంతేకాకుండా చిత్రయూనిట్ తరుపున అమరులైన సైనిక కుటుంబాలకు రూ.50లక్షల విరాళాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment