
ఆర్ఆర్ఆర్ సినిమాకు తన వల్లే ఆస్కార్ వచ్చిందని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నటించిన భోళా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ నాటు నాటు ఆస్కార్ గెలవడంతో అజయ్‌కి శభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీరు నటించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి ఆస్కార్ రావడం ఎలా అనిపించిందని కపిల్ శర్మ ప్రశ్నించాడు.
చదవండి: అప్పట్లోనే సొంత హెలికాప్టర్, వేల కోట్ల ఆస్తులు.. నటి విజయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
దీనికి అజయ్ దేవగన్ స్పందిస్తూ నిజానికి నాటు నాటుకు ఆస్కార్ నా వల్లే వచ్చిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేలా? అని హోస్ట్ అడగ్గా.. ‘అదే నేను నాటు నాటుకు డాన్స్ చేసి ఉంటే ఎలా ఉండేది. నా డాన్స్ చూసి అకాడెమీ జ్యూరీ మెంబర్స్ ఆస్కార్ ఇచ్చేవారే కాదు’ అంటూ చమత్కిరించాడు. అజయ్ సమాధానం విని అంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.
చదవండి: నాని ‘దసరా’కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు, భారీగా కట్స్..
దీంతో అజయ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ తర్వాత అంతటి సెన్స్ ఆఫ్ హ్యుమర్ అజయ్ దేవగన్‌లోనే ఉంది’, ‘ఒకవేళ అదే పాటకు సన్నీ డియోల్ డాన్స్ చేసి ఉంటే ఎలా ఉండేది.. ఊహించుకోండి’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తండ్రిగా అజయ్ కనిపించారు.
To ye Raaz hai #NaatuNaatuSong ko Oscar milne ka 😯 pic.twitter.com/P9GXv4sy7K
— Pooran Marwadi (@Pooran_marwadi) March 24, 2023