Jr NTR looks dapper in blue suit South Asian Excellence pre-Oscars event - Sakshi
Sakshi News home page

Jr NTR: అమెరికాలో జూ. ఎన్టీఆర్‌ సందడి.. తారక్‌ న్యూలుక్‌ చూశారా?

Published Sat, Mar 11 2023 3:31 PM | Last Updated on Sat, Mar 11 2023 3:50 PM

Jr NTR Shares Latest Look in Blue Colour Suit Goes Viral - Sakshi

ఆస్కార్‌ అవార్డు కార్యక్రమం నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీం అమెరికాలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌లు వరుసగా హలీవుడ్‌ మీడియాతో ముచ్చటిస్తు‍న్నారు. వేరుగా వేరుగా ఇంటర్య్వూలు ఇస్తున్న చరణ్‌, తారక్‌లు అవకాశం వస్తే హాలీవుడ్‌లోనూ నటించేందుకు సి​ద్ధమేనంటూ ఆ దిశగా తమని తాము ప్రమోట్‌ చేస్తుకుంటున్నారు. అంతేకాదు తరచూ ఫొటోషూట్‌లకు ఫోజులు ఇస్తున్నారు.

చదవండి: ‘బలగం’ మూవీపై చిరంజీవి రివ్యూ, ఏమన్నారంటే..

ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్‌ ఇచ్చిన ఫొటోషూట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదివరకు ఎన్నడు తారక్‌ను ఇలా చూడలేదంటూ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. సూట్‌లో తారక్‌ మాసివ్‌ క్లాసీ లుక్‌ను ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎన్టీతార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో ఆయన న్యూలుక్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. బ్లూ కలర్‌ సూట్‌తో తారక్‌ చాలా క్లాసీగా, కూల్‌గా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: తొలిసారి విమానం ఎక్కిన గంగవ్వ హడావుడి చూశారా? ట్రెండింగ్‌లో వీడియో

కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో నాటు నాటు ఒరిజినల్‌ సాంగ్‌ కాటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. మరి ఆదివారం జరిగే ఈ వేడుకలో ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ ఖాయమంటూ తెలుగు ప్రేక్షకులంతా ధీమా వ్యక్తి చేస్తున్నారు. ఆస్కార్‌ ఒక్క అడుగు చేరువలో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌కు ఈ అవార్డు వరిస్తుందా? లేదా? అని భారత ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, హాలీవుడ్‌ క్రిటిక్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement