సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం) సినిమాలో అజయ్ దేవగన్ జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల గురువుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఫ్లాష్ బ్యాక్‌లో ఫ్లాష్‌బాక్ సీన్లలో కనిపించనున్నట్లు సమాచారం. అతనికి జంటగా శ్రియ శరణ్ నటించనుంది. ఇక 1920 ల కాలం నాటి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా, హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. (‘ఆర్‌ఆర్‌ఆర్’ ట్రయిల్ షూట్ రద్దు.. అందుకేనా!)
ఈ సినిమాలో తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కి జోడీగా ఒలివియా మోరిస్, రామ్ చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్స్ , అలిసన్ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment