
అజయ్ దేవగన్
మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ పేరుతో ఓ హిందీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. టైటిల్ రోల్‌లో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ లుక్ ఇటీవల విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘కొత్త సంవత్సరాన్ని నాతో మొదలుపెట్టండి.
ఎందుకంటే జనవరి 10న ‘తన్హాజీ’ రిలీజ్ కానుంది’’ అని అజయ్ ట్వీట్ చేశారు. టైటిల్‌లో మార్పు గమనించారా? ముందు ‘తానాజీ’ అనుకున్నారు. ఇప్పుడు ‘తన్హాజీ’ అంటున్నారు. న్యూమరాలజీ ప్రకారం ఈ మార్పు చేశారట. అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ ముగ్గురూ ఓ ప్రముఖన్యూమరాలజిస్ట్‌ని కలిశారట. ఆయన సూచించిన మేరకే టైటిల్‌ని ‘తన్హాజీ’గా మార్చారట.
Comments
Please login to add a commentAdd a comment