
ప్రభాస్ హీరోగా నటించనున్న మరో ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్, ఓం రౌత్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్ర చేయనుండగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.
మరో కీలకమైన శివుడి పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆది పురుష్’లో తొలుత రావణుడి పాత్ర కోసం అజయ్‌ని సంప్రదించగా డేట్ల సమస్యతో తిరస్కరించారట. దీంతో ఆ పాత్రకు సైఫ్‌ని తీసుకున్నారు. అయితే శివుడి పాత్రకు అజయ్ సరిగ్గా సరిపోతారని ఓం రౌత్ భావిస్తున్నారట. ఎలాగైనా డేట్స్ సర్దుబాటు చేయమని అజయ్‌ను అడగాలనుకుంటున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment