
ఆమా (అవును)... తమిళ్ రీమేకే! తమ్మూ బేబీకి ఇంకో తమిళ్ రీమేక్‌లో నటించమని బీటౌన్ నుంచి పిలుపు వచ్చిందట! ఇంకొకటి ఏంటి? ఆల్రెడీ హిందీలో తెరకెక్కుతోన్న తమిళ్ రీమేక్‌లో ఎందులోనైనా తమన్నా నటిస్తున్నారా? అంటే... ఆమా! చక్రి తోలేటి దర్శకత్వంలో ప్రభుదేవా సరసన ‘ఖామోషి’ అనే హిందీ సిన్మా చేస్తున్నారు. తమిళ్‌లో నయనతార నటిస్తున్న ‘కొలైయుధిర్ కాలమ్’కి హిందీ రీమేక్ అది.
ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ ఆఫర్ ఇంకొకటి వచ్చిందట! ‘చిక్కడు దొరకడు’ సినిమా చూశారా? ఎన్టీఆర్, కాంతారావుల సిన్మా కాదు... ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్, బాబీ సింహా హీరోలుగా చేసిన తమిళ్ సిన్మా ‘జిగర్‌తండా’ తెలుగు డబ్బింగ్ ఇది. మన తెలుగులో సరిగా చూడలేదు. కానీ, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్.
ఇప్పుడా ‘జిగర్‌తండా’ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. సంజయ్ దత్, ఫర్హాన్ అక్తర్ హీరోలు. మరో హీరో అజయ్ దేవగన్ నిర్మాత. ఇందులో తమ్మూ బేబీని నటించమని అడిగారట! ఈమె ఆల్మోస్ట్ ఓకే చేప్పేశారట! ఇప్పటివరకూ హిందీలో చేసిన సినిమాలేవీ తమన్నాకు పెద్దగా కలసిరాలేదు. ఇప్పుడీ రెండు రీమేక్స్ బ్రేక్ తీసుకొస్తాయేమో. వెయిట్ అండ్ సీ!!
Comments
Please login to add a commentAdd a comment