jigartanda
-
కామెడీ టు సీరియస్
‘పెళ్లాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు మస్తు తెలుసు’ అంటూ వెంకటేశ్‌తో కలసి ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) లో కామెడీ పండించారు వరుణ్ తేజ్. ఇప్పుడు ‘వాల్మీకి’ సినిమా కోసం సీరియస్ మూడ్‌లోకి మారిపోయారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ఇది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం స్టార్ట్ అయింది. తమిళ చిత్రం ‘జిగర్తండా’కి ఇది అఫీషియల్ రీమేక్. ఇందులో వరుణ్ తేజ్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. తమిళ హీరో అధర్వ కీలక పాత్ర పోషించనున్నారని టాక్. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అయాంక బోస్. -
తమ్మూ... తమిళ్ రీమేకా?
ఆమా (అవును)... తమిళ్ రీమేకే! తమ్మూ బేబీకి ఇంకో తమిళ్ రీమేక్‌లో నటించమని బీటౌన్ నుంచి పిలుపు వచ్చిందట! ఇంకొకటి ఏంటి? ఆల్రెడీ హిందీలో తెరకెక్కుతోన్న తమిళ్ రీమేక్‌లో ఎందులోనైనా తమన్నా నటిస్తున్నారా? అంటే... ఆమా! చక్రి తోలేటి దర్శకత్వంలో ప్రభుదేవా సరసన ‘ఖామోషి’ అనే హిందీ సిన్మా చేస్తున్నారు. తమిళ్లో నయనతార నటిస్తున్న ‘కొలైయుధిర్ కాలమ్’కి హిందీ రీమేక్ అది. ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ ఆఫర్ ఇంకొకటి వచ్చిందట! ‘చిక్కడు దొరకడు’ సినిమా చూశారా? ఎన్టీఆర్, కాంతారావుల సిన్మా కాదు... ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్, బాబీ సింహా హీరోలుగా చేసిన తమిళ్ సిన్మా ‘జిగర్తండా’ తెలుగు డబ్బింగ్ ఇది. మన తెలుగులో సరిగా చూడలేదు. కానీ, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్. ఇప్పుడా ‘జిగర్తండా’ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. సంజయ్ దత్, ఫర్హాన్ అక్తర్ హీరోలు. మరో హీరో అజయ్ దేవగన్ నిర్మాత. ఇందులో తమ్మూ బేబీని నటించమని అడిగారట! ఈమె ఆల్మోస్ట్ ఓకే చేప్పేశారట! ఇప్పటివరకూ హిందీలో చేసిన సినిమాలేవీ తమన్నాకు పెద్దగా కలసిరాలేదు. ఇప్పుడీ రెండు రీమేక్స్ బ్రేక్ తీసుకొస్తాయేమో. వెయిట్ అండ్ సీ!! -
బాబీసింహా చిత్ర విడుదలపై సందిగ్ధం
నటుడు బాబీసింహా చిత్రం చర్చల్లో చిక్కుకుంది. జిగర్తండా చిత్రంలో విలన్‌గా అట్టహాసం చేసి జాతీయ అవార్డును కైవసం చేసుకున్న యువ నటుడు బాబీసింహా. ఆ తరువాత కూడా ప్రతి నాయకుడిగా కొన్ని చిత్రాల్లో నటించిన ఈయన కథానాయకుడిగా అవతారమెత్తారు. అలా ఆయన హీరోగా నటించిన చిత్రాల్లో పాంబుసట్టై ఒకటి. కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఆటమ్ దాసన్ దర్శకత్వంలో నటుడు మనోబాలా నిర్మించారు. చాలా కాలం నిర్మాణంలో ఉన్న పాంబుసట్టై చిత్రం ఎట్టకేలకు విడుదలకు ముస్తాబవుతోంది. అయితే చిత్రానికి సెన్సార్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కారణం చిత్రంలో బాబీసింహా ఒక సన్నివేశంలో నగ్నంగా నటించారట. దీంతో అలాంటి కొన్ని సన్నివేశాలను తొలగించి చూపించండి చిత్రానికి (యూ) సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పారని సమాచారం. బాబీసింహా నటించిన నగ్న దృశ్యాలను ఒక్క షాట్లో కాకుండా వివిధ కోణాల్లో చిత్రీకరించారనీ, చిత్ర కథకు ప్రాధాన్యం ఉన్న ఆ సన్నివేశాలను కత్తిరించడానికి చిత్ర యూనిట్‌కు ఇష్టం లేదని సమాచారం. అయితే తాము అభ్యంతరం చెప్పిన సన్నివేశాలను తొలగిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు సభ్యులు అంటున్నారట. దీంతో ఈ నెల 30వ తేదీన పాంబుసట్టై చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించినా, ఆ తేదీని మాత్రం ప్రకటనల్లో వెల్లడించడం లేదు. దీంతో సాంబుసట్టై చిత్ర విడుదలపై సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. -
ఎవరికీ పోటీ కాను
సిద్ధార్థ్ నటించిన ‘జిగర్తండా’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల తర్వాత ఒక సంవత్సరం ప్రత్యేకత కలిగి ఉంటుందన్నారు. 2014 తనకు అటువంటి ప్రత్యేకత కల్పించిందన్నారు. ఈ ఏడాది మొదట్లో విడుదలయిన జిగర్తండా పెద్ద హిట్ సాధించిందన్నారు. వసంతబాలన్ దర్శకత్వంలో ‘కావ్య తలైవన్’, కన్నడ రీమేక్ చిత్రం ‘లూసియా’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ రెండు చిత్రాలు భిన్న కథాంశాలతో రూపొందాయని తెలిపారు. ఇవి కూడా విజయం సాధిస్తాయన్నారు. తన నిర్మాణంలో చిత్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనేక సంవత్సరాల క్రితం రంగ్ దే బసంతి చిత్రంలో అమీర్‌ఖాన్‌తో నటిస్తుండగా ఆయన తన పాత్రకు మంచి స్కోప్ అందజేసి సహకరించారని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా జిగర్తండా చిత్రంలోను మరో పాత్రలో నటించిన సింహా కరతాళధ్వనులు అందుకోనున్నారని గ్రహించానని చెప్పారు. అందుకోసమే తాను నటించానన్నారు. సాటి నటులకు సహకరించడాన్ని అమీర్‌ఖాన్ నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు. ఈ ఏడాది వివాహం చేసుకోనని, వచ్చే ఏడాది జరగవచ్చని పేర్కొన్నారు. దీని గురించి ఇప్పుడే ప్రముఖంగా ప్రస్తావించదలచుకోలేదన్నారు. తెలుగు చిత్రసీమ నుంచి వైదొలగలేదని, తర్వాత రెండు చిత్రాల్లో నటించనున్నానని తెలిపారు. తెలుగులో అభిమానులు తననెంతో ఆదరించారని, వారిని ఎప్పటికీ విడిచివెళ్లనని సిద్ధార్థ్ తెలిపారు.