రూ. 30 కోట్ల భారీ సెట్‌ ధ్వంసమైంది.. బోని కపూర్‌ ఆవేదన | Boney Kapoor Says Rs 30 Crore Maidaan Set Damage Due Cyclone Tauktae | Sakshi
Sakshi News home page

రూ. 30 కోట్ల భారీ సెట్‌ ధ్వంసమైంది.. బోని కపూర్‌ ఆవేదన

Published Sun, May 23 2021 11:01 AM | Last Updated on Sun, May 23 2021 11:10 AM

Boney Kapoor Says Rs 30 Crore Maidaan Set Damage Due Cyclone Tauktae - Sakshi

అజయ్ దేవగణ్ హీరోగా బోనికపూర్ నిర్మిస్తున్న మైదాన్ చిత్రం కోసం భారీ సెట్‌ను ముంబైలో వేశారు

ఒకవైపు కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే.. మూలిగే నక్క మీద తాటిపండు పడడం అన్నట్లుగా తౌటే తుఫాన్‌ ​వచ్చి దేశంలో కల్లోలం సృష్టించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ తుఫాన్‌ ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా భారీగానే పడింది. బాలీవుడ్‌కు చెందిన చాలా సినిమాల సెట్టింగులు దెబ్బ తిన్నాయి. వందల కోట్ల నష్టం వాటిల్లింది. కేవ‌లం మైదాన్ అనే సినిమాకు సంబంధించి తుపాను కార‌ణంగా రూ.30 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ట‌. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బోని కపూర్‌ మీడియాకు వెల్లడించారు.

అజయ్ దేవగణ్ హీరోగా బోనికపూర్ నిర్మిస్తున్న మైదాన్ చిత్రం కోసం భారీ సెట్‌ను ముంబైలో వేశారు. అయితే తౌటే తుఫాన్ దాటికి ఆ సెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో బోనికపూర్ మాట్లాడుతూ..‘గతేడాది లాక్‌డౌన్ సమయంలో మైదాన్ కోసం వేసిన సెట్‌ను తొలిసారి కూలగొట్టాం. ఆ తర్వాత మళ్లీ రెండోసారి సెట్ వేసి చిత్రీకరించాం. ఆ తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత మరోసారి సెట్ నిర్మించాం. అయితే ప్రస్తుత తౌటే తుఫాన్ ధాటికి మళ్లీ సెట్ అంతా కూలిపోయింది. దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది ’అని బోనికపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement