దృశ్యం 2 క్రేజీ అప్‌డేట్.. టీజ‌ర్‌ డేట్ ఫిక్స్ | Drishyam 2 First look And Teaser out tomorrow | Sakshi
Sakshi News home page

Ajay Devgn Drishyam 2 Movie: అజయ్ దేవ్‌గణ్  దృశ్యం 2 టీజర్ ఎప్పుడంటే?

Published Wed, Sep 28 2022 9:33 PM | Last Updated on Wed, Sep 28 2022 9:34 PM

Drishyam 2 First look And Teaser out tomorrow - Sakshi

అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. మ‌లయాళంలో సూప‌ర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌లై ఘనవిజయం సాధించింది. తాజాగా హిందీలో రాబోతున్నదృశ్యం 2 నుంచి క్రేజీ  అప్‌డేట్ వ‌చ్చేసింది. అజ‌య్ దేవ్‌గ‌న్‌, శ్రియ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబ‌ట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్, టీజర్‌నుగురువారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ  విషయాన్ని ట్విట‌ర్ ద్వారా పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ న‌వంబ‌ర్ 18 థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. అక్ష‌య్ ఖ‌న్నా, ట‌బు, రజ‌త్ క‌పూర్‌, ఇషితా ద‌త్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో 2015లో వచ్చిన మోహన్ లాల్ చిత్రానికి రిమేక్. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement