అక్కడ తగ్గాల్సిందే! | Keerthy Suresh Slim Look | Sakshi
Sakshi News home page

అక్కడ తగ్గాల్సిందే!

Published Sun, Jun 2 2019 9:52 AM | Last Updated on Sun, Jun 2 2019 9:52 AM

Keerthy Suresh Slim Look - Sakshi

నటి కీర్తీసురేశ్‌ ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలో నటిగా ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి అన్నది తెలిసిందే. సాధారణంగా మొదట్లో కమర్శియల్‌ చిత్రాల్లో చాలా లైట్‌ పాత్రల్లో నటించాలని చాలా మంది కోరుకుంటారు. అదే విధంగా వర్ధమాన నటీమణులను నమ్మి ఏ దర్శక నిర్మాత బరువైన పాత్రలను ఆఫర్‌ చేయడానికి సాహసించరు. అయితే లక్కీగా కీర్తీకి అలాంటి పాత్ర మహానటి చిత్రం రూపంలో వరించింది. ఈ సినిమాలో నాటి మేటి నటి సావిత్రిగా నటించడానికి కొందరు పరిహసించారు కూడా.

అయినా దర్శకుడి సూచనలతో కీర్తీసురేశ్‌ తన పనిని సమర్థవంతంగా చేసింది. ఇవాళ సావిత్రి పాత్ర అంటే కీర్తీసురేశ్‌నే చేయాలి అనేంతగా పేరు తెచ్చుకున్నారు. అయితే అంతకుముందు కూడా రజనీమురుగన్, రెమో వంటి కమర్శియల్‌ చిత్రాల్లో నటించి సక్సెస్‌ అయ్యారు. కాగా మహానటి చిత్రం తరువాత కీర్తీసురేశ్‌ స్థాయి పూర్తిగా మారిపోయారు. దానికి తగ్గట్టుగానే ఈ బ్యూటీ కథలను ఎంచుకుంటున్నారని చెప్పవచ్చు.

ఇక చాలా మంది హీరోయిన్లు మొదట్లో ఆచితూచి అడుగులు వేసి ఆ తర్వాత హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా పాత్రలు చేస్తారు. అలాంటిది కీర్తీసురేశ్‌కు మొదట్లోనే అలాంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథ చిత్రాల అవకాశాలు తలుపు తట్టడం ఆమె అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ చిన్నది తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో కథానాయకి సెంట్రిక్‌ పాత్రలో నటిస్తున్నారు. దీనికి నరేంద్రనాథ్‌ దర్శకుడు. దీనితో పాటు మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నారు.

అంతే కాదు ఇప్పుడు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. లక్కీగా తొలి హిందీ చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీలో కథానాయికల్ని బొద్దుగా ఉంటే అంగీకరించరు.  అందుకే దక్షిణాదిలో పాపులర్‌ అయిన కథానాయికలు బాలీవుడ్‌కెళితే స్లిమ్‌ కావలసిందే.

నటి తమన్నా, కాజల్‌అగర్వాల్, ఇలియానా వంటి వారు బాలీవుడ్‌లో అవకాశం వస్తే ముందుగా చేసే పని బరువు తగ్గడం. ఎంతగా అంటే జీరోసైజ్‌ అంటారే అంతగా. నటి తాప్సీ కూడా బరువు బాగా తగ్గడం వల్లే బాలీవుడ్‌లో పాగా వేయగలిగింది. ఇప్పుడు నటి కీర్తీసురేశ్‌ అందుకు కసరత్తులు చేయక తప్పలేదు. నిజానికి కీర్తీది ఏమంత భారీ కాయం కాదు. అయినా ఇంకా బరువు తగ్గాల్సిన పరిస్థితి. అక్కడి వారి అభిరుచి అంతే. అందుకనుగణంగా కీర్తీ మారిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement