అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగన్
అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ ఏడేళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 1990–2000 మధ్య కాలంలో దేశ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులకు తోడు కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా హిందీలో కూకై గులాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ఈ సినిమాలో అజయ్, అభిషేక్ హీరోలుగా నటించబోతున్నారని బాలీవుడ్ టాక్.
హీరోయిన్‌గా ఇలియానా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా అజయ్ దేవగన్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందనుందని సమాచారం. చివరి సారిగా అజయ్, అభిషేక్ కలిసి 2012లో వచ్చిన ‘బోల్ బచ్చన్’ సినిమాలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంతకుముందు ‘జమీన్’ (2003), ‘యువ’ (2004) (హిందీ వెర్షన్) సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ బాలీవుడ్ స్టార్ హీరోలు.
Comments
Please login to add a commentAdd a comment