శింబు సినిమాలో విలన్‌గా సుదీప్‌ | Sudeep To Play Antagonist In Simbu And Venkat Prabhu Film | Sakshi
Sakshi News home page

శింబు సినిమాలో విలన్‌గా సుదీప్‌ ?

Published Sun, Dec 22 2019 3:15 PM | Last Updated on Sun, Dec 22 2019 3:20 PM

Sudeep To Play Antagonist In Simbu And Venkat Prabhu Film - Sakshi

ఇటివలే విడుదలైన సల్మాన్‌ఖాన్‌ దబాంగ్‌-3 సినిమాలో కన్నడ హీరో సుదీప్‌ విలన్‌ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సుదీప్‌ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.  అయితే సుదీప్‌ మరోసారి విలన్‌గా నటించనున్నాడు. కాకపోతే ఈసారి తమిళ్‌ సినిమాలో ఆ పాత్రను చేయనున్నాడు. వివరాల్లోకి వెళితే..  శింబు హీరోగా 'మానాడు' అనే సినిమా చేస్తున్నట్లు 2018లోనే వెంకట్‌ ప్రభు వెల్లడించారు. అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న సురేశ్‌ కామట్జి, శింబుల మధ్య మనస్పర్థలు రావడంతో నిర్మాణ దశలోనే ఈ చిత్రం ఆగిపోయింది. శింబు తండ్రి, సినీ దర్శకుడు టి. రాజేందర్‌ జోక్యంతో ' మానాడు'  సినిమాను చేస్తున్నట్లు వెంకట్‌ ప్రభు వెల్లడించారు.

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరిలో ప్రారంభిస్తున్నట్లు నిర్మాత సురేశ్‌ కామట్జి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలన్‌గా నటించాలని దబంగ్‌-3 షూటింగ్‌ సమయంలోనే సుదీప్‌ను అడిగామని ప్రొడ్యూసర్‌ సురేశ్‌ కామట్జి తెలిపారు. స్టోరీ విన్న సుదీప్‌ వెంటనే ఈ సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నారని పేర్కొన్నారు. పొలిటికల్‌ బాక్‌డ్రాఫ్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మిగతా పాత్రలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. కాగా సుదీప్‌ గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' సినిమాలో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement