పహిల్వాన్‌ సుదీప్‌ | Kiccha Sudeep Pailwan poster releases in 5 languages | Sakshi
Sakshi News home page

పహిల్వాన్‌ సుదీప్‌

Published Wed, Jun 5 2019 3:17 AM | Last Updated on Wed, Jun 5 2019 3:17 AM

Kiccha Sudeep Pailwan poster releases in 5 languages - Sakshi

సుదీప్‌ ఇప్పుడు పహిల్వాన్‌ అయ్యారు. అచ్చమైన పహిల్వాన్‌లా కనిపించడానికి ఆయన ఎంత శ్రద్ధగా కసరత్తులు చేశారో ఇక్కడున్న ఫొటో చూస్తే అర్థమవుతోంది. ‘పహిల్వాన్‌’లోని సుదీప్‌ లుక్‌ని మంగళవారం విడుదల చేశారు. ఈ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ దిల్‌ ఖుష్‌ అయింది. ఇందులో సుదీప్‌ బాక్సర్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. 2017లో ‘హెబ్బులి’లాంటి సూపర్‌ హిట్‌ మూవీ ఇచ్చిన తర్వాత మళ్లీ దర్శకుడు ఎస్‌. కృష్ణ, సుదీప్‌ కాంబినేషన్‌ రూపొందిన చిత్రం ‘పహిల్వాన్‌’. దాంతో ఈ చిత్రంపై మొదటి నుంచే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు విడుదలైన లుక్‌ ఆ అంచనాలను మరింత పెంచింది. కన్నడంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement