Simbu Gets Emotional At Maanaadu Audio Release Event - Sakshi
Sakshi News home page

Simbu Maanaadu: ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటా: శింబు

Published Fri, Nov 19 2021 6:47 AM | Last Updated on Fri, Nov 19 2021 1:27 PM

Simbu Emotional Speech At Maanaadu Audio Release Launch - Sakshi

మానాడు చిత్ర ఆడియో ఆవిష్కరణ దృశ్యం  

సాక్షి, చెన్నై(తమిళనాడు): నటుడు శింబు మానాడు చిత్ర ఆడియో వేదికలో కంటతడి పెట్టారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. కల్యాణి ప్రియదర్శన్‌ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వి.హౌస్‌ పతాకంపై సురేష్‌ కామాక్షి నిర్మించారు.

ఎస్‌.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించగా.. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించారు. ఈ నెల 25న తమిళం, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. శింబు మాట్లాడుతూ ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటానని, అభిమానులు మాత్రం తన వెంటే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement