Harry Josh Re Entry With Tollywood Movie Game Changer, Deets Inside - Sakshi
Sakshi News home page

Game Changer Movie: రామ్ చరణ్ 'గేమ్‌ ఛేంజర్‌'కు మరింత జోష్.. విలన్‌గా ఎవరంటే?

Published Mon, Apr 24 2023 5:08 PM | Last Updated on Mon, Apr 24 2023 7:50 PM

Harry Josh Re Entry with Tollywood With Game Changer Movie  - Sakshi

బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా పేరున్న నటుడు 'హ్యారి జోష్'. హిందీతో పాటు పలు భాషల్లో నటించి మెప్పించారు. టాలీవుడ్‌లో బన్నీ చిత్రం బద్రినాథ్‌లో విలన్‌ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే మరోసారి టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబర్ స్టార్‌ రామ్ చరమ్‌ మూవీలో విలన్‌గా కనిపించబోతున్నాడు. హ్యారీ జోష్ ఎంట్రీలో గేమ్ ఛేంజర్‌ చిత్రంపై అంచనాలు మరింత పెరగనున్నాయి. అలాదే మంచు మంచు లక్ష్మి మెయిన్‌ రోల్‌లో సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఆది పర్వంలోనూ నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఓకేసారి రెండు సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. 

బాలీవుడ్‌లో వాంటెడ్, వెల్కమ్, ధూమ్ -2, గోల్ మాల్ -3, టార్జాన్ ది వండర్ కార్, కిస్నా, ముసాఫిర్, సింగ్ ఈజ్ బ్లింగ్ వంటి హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక నుంచి తెలుగులో పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాను అంటున్నాడు హ్యారి జోష్. హిందీ, తెలుగు భాషల్లోనే కాకుండా... పంజాబీ, కన్నడ, మరాఠీ చిత్రాల్లోనూ నటించిన హాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. దాదాపు వందకుపైగా యాడ్ ఫిల్మ్స్ లోనూ నటించారు. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్, ఆది పర్వం చిత్రాలతో తెలుగులో మరోసారి సత్తా చాటనున్నారు.  

హ్యారీ జోష్ ఉద్యోగ రీత్యా కెనడాలో ఉండగా...'అక్కడ షూటింగ్ కోసం వచ్చిన హృతిక్ రోషన్ సినిమా లొకేషన్స్ కోసం సాయం చేయడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. అదే అతన్ని ఇండియా తిరిగి వచ్చేలా చేసింది. హృతిక్, రాకేష్ రోషన్‌ ప్రోత్సాహంతో... అమితాబ్ బచ్చన్‌తో కలిసి యాడ్ ఫిల్మ్ చేసే అవకాశం దక్కించుకున్న హ్యారీ.. అమ్రిష్ పురి తన రోల్ మోడల్ అని సగర్వంగా చెప్పుకుంటాడు. అంతేకాకుండా హ్యారీ జోష్ త్వరలోనే తెలుగులో  నటించే సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకునేలా... తెలుగు నేర్చుకోవడం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement