వెండితెరకు వేలుపిళ్లై | Agnidev: Trailer of the Bobby Simha and Madhu Bala starrer unveiled | Sakshi
Sakshi News home page

వెండితెరకు వేలుపిళ్లై

Published Wed, Nov 28 2018 12:56 AM | Last Updated on Wed, Nov 28 2018 12:56 AM

Agnidev: Trailer of the Bobby Simha and Madhu Bala starrer unveiled - Sakshi

ఎల్‌టీటీ వ్యవస్థాపకుడు, నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్‌ జీవితం ఆధారంగా తమిళంలో దర్శకుడు వెంకటేశ్‌ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ బయోపిక్‌లో ప్రభాకరన్‌ పాత్రలో తమిళ నటుడు బాబీ సింహా కనిపించనున్నారు. ఆల్రెడీ శ్రీలంకలో జరిగిన సివిల్‌ వార్‌ ఆధారంగా ‘నీలమ్‌’ తెరకెక్కించారు వెంకటేశ్‌. సెన్సార్‌ వివాదాలతో ఆ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ప్రభాకరన్‌ బయోపిక్‌ తెరకెక్కించడానికి సిద్ధమయ్యారాయన. ‘రేజింగ్‌ టైగర్‌’ పేరుతో రూపొందబోయే ఈ బయోపిక్‌ రెండు పార్ట్స్‌గా తెరకెక్కబోతోంది.

‘‘ఫస్ట్‌ పార్ట్‌లో ప్రభాకరన్‌ స్టూడెంట్‌గా ఉన్నరోజులు, ఆ తర్వాత రెబల్‌గా ఎలా మారాడు? లీడర్‌గా ఎలా ఎదిగాడు? అనేది చూపిస్తాం. సెకండ్‌ పార్ట్‌లో తమిళ ఈలమ్‌ కోసం జరిగిన యుద్ధాన్ని చూపించదలిచాం. ప్రభాకరన్‌కు దగ్గర పోలికలు బాబీ సింహాలో చూశాను. ఈ పాత్ర చేయడానికి బాబీ ఎటువంటి సంకోచం వ్యక్తం చేయలేదు’’ అన్నారు దర్శకుడు వెంకటేశ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement