
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రీలీజ్ చేయగా అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు డా.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కనిపంచనున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. కన్నప్ప సినిమా మధుబాల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా పోస్టర్‌పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపేలా ఉన్నాయి. దీంతో కన్నప్పపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే పలువురు పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Presenting #Madhubala as #Pannaga; The chief of clan with her fierce & dare-devil spirit she is a force to be reckoned with 🔥#Madhoo #Kannappa🏹 #HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar @mukeshvachan @MsKajalAggarwal… pic.twitter.com/1qnbiXwQEq
— Kannappa The Movie (@kannappamovie) July 29, 2024