‘అర్థవంతంగా కాకుండా.. అర్దాంతరంగా ముగించేస్తాడు’ | Prema Desam Teaser Released | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 18 2019 8:33 PM | Last Updated on Fri, Jan 18 2019 8:40 PM

Prema Desam Teaser Released - Sakshi

ఒకప్పటి ప్రేమదేశం సినిమా ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రయాంగల్‌ లవ్‌స్టోరీస్‌లో ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే ఈ మూవీ టైటిల్‌ కూడా అప్పటినుంచి అంతే ప్రత్యేకతను సంపాదించుకుంది. మళ్లీ ఇన్నేళ్లకు ఇదే టైటిల్‌తో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ప్రస్తుతం విడుదల చేశారు. 

మూడు జంటల ప్రేమకథల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ టీజర్‌లో ఒక జంట లవ్‌స్టోరీని మాత్రమే చూపించారు.  రెండో కథకు సంబంధించిన టీజర్‌ను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మంచి ఫీల్‌ను కలిగిస్తున్న ఈ టీజర్‌లో ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌ చివరన తనికెళ్ల భరణి చెప్పిన ‘అన్ని కథలు అర్థవంతంగా కాకుండా కొన్ని అర్ధాంతరంగా ముగించేస్తాడు’ అనే డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది. శ్రీకాంత్‌ సిద్దం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement