ఓ వైపు హీరోయిన్‌గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకెళుతున్నారు రష్మికా మందన్న. ఆమె లీడ్ రోల్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు–దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.
ఈ చిత్రం టీజర్ చూసిన అనంతరం డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్‌ను రాహుల్ రవీంద్రన్ చూపించాడు. రష్మిక నటన, భావోద్వేగాలు, క్లోజప్ షాట్స్ చాలా బాగున్నాయి’’ అని పేర్కొన్నారు. ‘‘వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది’’ అన్నారు మేకర్స్. ఇదిలా ఉంటే త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌లో రష్మిక పాత్రను, నేపథ్యాన్ని హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో పరిచయం చేస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment