Prema Desam 2022 Movie Video Glimpse Crossed 1 Million Views In Youtube - Sakshi
Sakshi News home page

‘ప్రేమదేశం’ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన

Published Sat, May 7 2022 2:17 PM | Last Updated on Sat, May 7 2022 3:23 PM

Prema Desam Movie Video Glimpse Crossed 1 Million Views In Youtube - Sakshi

1996లో వచ్చిన ‘ప్రేమదేశం’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ అందించిన పాటలు.. అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాదాపు దశాబ్దం పాటు ఎక్కడ చూసిన అవే పాటలు వినిపించాయి. చాలాకాలం తర్వాత ఇప్పుడు అదే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతుంది.మేఘా ఆకాశ్‌, త్రిగున్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన మ్యూజికల్‌ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో  ఈ సినిమా గ్లిమ్స్ ఇప్పటికే 1 మిలియన్‌ వ్యూస్‌ని క్రాస్‌ చేసిందిశ్రీకాంత్‌ సిద్దం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధం నిర్మిస్తున్నారు. అలనాటి అందాల తార మధుబాల ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో లో చిత్రీకరించబడుతున్న ఈ సినిమా  షూటింగ్ పూర్తి చేసుకొంది .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement