Prema Desam Actor Abbas Hospitalised For Surgery, Hospital Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Abbas Hospitalised: ప్రేమదేశం హీరో అబ్బాస్‌కు సర్జరీ, ఫొటో వైరల్‌

Published Mon, Nov 21 2022 7:29 PM | Last Updated on Mon, Nov 21 2022 7:58 PM

Prema Desam Hero Abbas Hospitalised - Sakshi

కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటి క్రేజ్‌ ఏమాత్రం తగ్గదు. అందులో ప్రేమదేశం సినిమా ఒకటి. కదీర్‌ దర్శకత్వంలో వచ్చిన ప్రేమదేశం బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు హీరో అబ్బాస్‌. తర్వాత పలు సినిమాలు చేసిన అబ్బాస్‌ 2015లో సినీకెరీర్‌కు విరామం పలికాడు. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిపోయి అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సెటిలయ్యాడు.

తాజాగా అతడు సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను అబ్బాస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 'ఆస్పత్రిలో ఉన్న సమయంలో నా మనసంతా గందరగోళంగా ఉంది. దాన్ని అధిగమించేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. శస్త్ర చికిత్స తర్వాత కొంత ఉపశమనం కలిగింది. నా కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరినీ కృతజ్ఞతలు' అని అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు అబ్బాస్‌.

చదవండి: నీ నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది: యాంకర్‌ వెకిలి చేష్టలు
నేను డబ్బు కోసం ఈ పని చేయట్లేదు: దిల్‌ రాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement