పుష్ప 2 కోసం 8 సినిమాలు వదిలేశా: నటుడు | Sritej Says He Rejected 8 Projects For Pushpa 2 Movie | Sakshi
Sakshi News home page

Sritej: పది నెలల్లో 8 సినిమాలు వదులుకున్నా.. అంతా పుష్ప 2 కోసమే!

Published Mon, Jul 22 2024 3:32 PM | Last Updated on Mon, Jul 22 2024 3:46 PM

Sritej Says He Rejected 8 Projects For Pushpa 2 Movie

పుష్ప, ధమాకా, మంగళవారం.. ఇలా విభిన్న సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీతేజ్‌. ఈయన ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్‌ అవుతోంది. ఈయన పాన్‌ ఇండియా మూవీ పుష్ప 2 లోనూ నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం చేతిదాకా వచ్చిన ఏడెనిమిది ప్రాజెక్టులను పోగొట్టుకున్నాడట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.

గడ్డం కోసం సినిమాలు వదిలేశా
శ్రీతేజ్‌ మాట్లాడుతూ.. 'పుష్ప 2 సినిమా కోసం కొన్ని సినిమాలు వదిలేసుకున్నాను. పది నెలల్లో ఎనిమిది ప్రాజెక్టుల దాకా వదిలేశాను. పుష్ప లాంటి పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఏ క్షణాన పిలిచినా చేసేందుకు రెడీగా ఉండాలి. షెడ్యూల్స్‌ కూడా మారుతూ ఉన్నాయి. గడ్డం తీసేస్తే మళ్లీ ఈ స్థాయిలో పెరగాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుంది.  కాబట్టి నా లుక్‌ కోసం కొన్ని ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది' అని పేర్కొన్నాడు.

చదవండి: నటికి సర్జరీ? ట్రాన్స్‌జెండర్‌లా ఉందంటూ ట్రోల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement