నటికి సర్జరీ? ట్రాన్స్‌జెండర్‌లా ఉందంటూ ట్రోల్స్‌ | Actress Saniya Iyappan Gets Slammed For Her New Look | Sakshi
Sakshi News home page

మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై బ్యూటీ.. 'ఉన్న అందం పోయింది' అంటూ ట్రోల్స్‌

Published Mon, Jul 22 2024 1:52 PM | Last Updated on Mon, Jul 22 2024 2:54 PM

Actress Saniya Iyappan Gets Slammed For Her New Look

సాంప్రదాయమైన దుస్తులు మాత్రమే ధరించే సెలబ్రిటీలు అరుదుగా కనిపిస్తారు. దాదాపు అందరు సినీతారలు మోడ్రన్‌, గ్లామర్‌గా కనిపించడానికే ఓటేస్తున్నారు. ఆఫర్లు రావాలంటే అందాల ప్రదర్శన తప్పనిసరి అన్నట్లుగా మారింది. మలయాళ బ్యూటీ సానియా ఇయప్పన్‌ కూడా ఇదే నమ్మింది. కొన్నిసార్లు చీర కడుతూనే ఎక్కువ సార్లు మోడ్రన్‌ దుస్తుల్లో కనువిందు చేస్తోంది.

ఇలా అయిపోయిందేంటి?
ఈ మధ్యే ఓ మాగజైన్‌ కోసం ఫోటోషూట్‌ చేసింది. ఇది చూసిన కొందరు నటి సర్జరీ చేయించుకుందని విమర్శిస్తున్నారు. తన ముఖమేంటి మగవాడిలా కనిపిస్తోంది? సడన్‌గా చూసి ట్రాన్స్‌జెండర్‌ అనుకున్నాను. ఆమెకు ఆ హెయిర్‌ స్టైల్‌ అస్సలు సెట్టవ్వలేదు. తన ముక్కు, పెదాలకు ఏదో సర్జరీ చేయించుకున్నట్లుగా ఉంది.. దీనివల్ల ఆమె సహజ అందం కోల్పోయింది అని కామెంట్లు చేస్తున్నారు.

అలాగైతే హాలీవుడ్‌కు వెళ్లేదాన్ని
ఇలా తనను ట్రోల్‌ చేయడం ఇది కొత్తేం కాదు. సానియా పొట్టి బట్టలు, కురచ దుస్తులు ధరించిన ప్రతిసారి నెటిజన్లు ఇలానే ట్రోల్‌ చేస్తుంటారు. అయితే ఈ నెగెటివ్‌ కామెంట్లను అస్సలు లెక్క చేయనని, తన జీవితం తన ఇష్టమని, తనకు నచ్చినట్లుగానే బతుకుతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

డ్యాన్సర్‌ నుంచి నటిగా
కాగా సానియా ఇయప్పన్‌.. చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది. 2014లో వచ్చిన సూపర్‌ డ్యాన్సర్‌ అనే రియాలిటీ షోలో పాల్గొని విన్నర్‌గా నిలిచింది. D ఫర్‌ డ్యాన్స్‌: రెండో సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా సరిపెట్టుకుంది. చిన్న వయసులో డ్యాన్స్‌ స్టెప్పులతో మైమరిపించిన సానియా మలయాళ క్వీన్‌ మూవీతో హీరోయిన్‌గా మారింది. లూసిఫర్‌, ప్రేతమ్‌ 2, కృష్ణకుట్టి పని తుడంగి, సెల్యూట్‌, సాటర్‌డే నైట్‌ వంటి మలయాళ చిత్రాల్లో మెరిసింది.

 

 

చదవండి: రాజమౌళి ఓ పిచ్చోడు.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement