Sritej
-
సినీ నటుడు శ్రీ తేజ్ పై చీటింగ్ కేసు
-
'పుష్ప' నటుడు శ్రీ తేజ్పై పోలీసు కేసు
తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్పై హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో BNS 69, 115(2),318(2) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు. గతంలోనూ ఇదే పీఎస్లో శ్రీతేజ్పై కేసు నమోదైంది.(ఇదీ చదవండి: యూరప్ వెళ్లనున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..?)'నారప్ప', 'మంగళవారం', 'పుష్ప' తదితర సినిమాల్లో సహాయ నటుడిగా చేసిన శ్రీతేజపై గతంలోనే కేసు నమోదైంది. ఓ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో ఇతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి సదరు వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషయమై మాదాపూర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఇలా వరస కేసుల వల్ల శ్రీతేజ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్ హ్యాండ్' లాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత) -
పుష్ప 2 కోసం 8 సినిమాలు వదిలేశా: నటుడు
పుష్ప, ధమాకా, మంగళవారం.. ఇలా విభిన్న సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీతేజ్. ఈయన ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతోంది. ఈయన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 లోనూ నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం చేతిదాకా వచ్చిన ఏడెనిమిది ప్రాజెక్టులను పోగొట్టుకున్నాడట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.గడ్డం కోసం సినిమాలు వదిలేశాశ్రీతేజ్ మాట్లాడుతూ.. 'పుష్ప 2 సినిమా కోసం కొన్ని సినిమాలు వదిలేసుకున్నాను. పది నెలల్లో ఎనిమిది ప్రాజెక్టుల దాకా వదిలేశాను. పుష్ప లాంటి పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఏ క్షణాన పిలిచినా చేసేందుకు రెడీగా ఉండాలి. షెడ్యూల్స్ కూడా మారుతూ ఉన్నాయి. గడ్డం తీసేస్తే మళ్లీ ఈ స్థాయిలో పెరగాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుంది. కాబట్టి నా లుక్ కోసం కొన్ని ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది' అని పేర్కొన్నాడు.చదవండి: నటికి సర్జరీ? ట్రాన్స్జెండర్లా ఉందంటూ ట్రోల్స్