'పుష్ప 2' బెన్‌ఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్.. కోలుకుంటున్నాడు. మొన్నటివరకు సీరియస్ కండీషన్‌లో ఉన్న ఇతడు.. ప్రస్తుతం కాళ్లు, చేతులు కదిలిస్తున్నాడు. ఈ మేరకు వైద్యులు.. లేటెస్ట్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో)
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్పారు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది, ఫీటింగ్ తీసుకోగలుగుతున్నాడని.. కాళ్లు-చేతులు కదిలిస్తున్నాడని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు పేర్కొన్నారు.
ఇదే సంఘటనలో శ్రీతేజ్ తల్లి ప్రాణాలు కోల్పోయింది. దీంతో పోలీసులు కేసు పెట్టి.. తొలుత సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్‌ని అరెస్ట్ చేశారు. తర్వాత హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. వీళ్లకు బెయిల్ వచ్చింది. దీంతో కేసు విచారణ ప్రస్తుతం నడుస్తోంది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment