Ajay Gadu OTT Release: ఓటీటీలో ఆకట్టుకుంటున్న తెలుగు సినిమా.. ఫ్రీగా చూసేయొచ్చు! | Ajay Gadu Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

Ajay Gadu OTT Release: సంక్రాంతికి రిలీజ్.. వారం నుంచి అలరిస్తున్న ఆ మూవీ

Published Wed, Jan 17 2024 6:00 PM | Last Updated on Wed, Jan 17 2024 7:05 PM

Ajay Gadu Movie OTT Streaming Details - Sakshi

ఇప్పుడు సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేవి సంక్రాంతికి రిలీజైనవే. ఆ నాలుగింటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తోంది. వీటి సంగతి పక్కనబెడితే ఓటీటీలో ఓ తెలుగు సినిమాకు కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే గత కొన్నిరోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?)

బిగ్‪‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్‌లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న అజయ్ కతుర్వర్.. పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూనే హీరోగానూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అలా హీరోగా నటిస్తూ స్వీయ దర్శక నిర్మాణంలో తీసిన చిత్రం 'అజయ్ గాడు'. తొలుత దీన్ని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకనో కుదర్లేదు. అలా సంక్రాంతి కానుకగా ఈ జనవరి 12న నేరుగా జీ5లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దగ్గర నుంచి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతోందని చెప్పొచ్చు. అలానే దీన్ని ఫ్రీగానే చూసేయొచ్చు.

ఇక కథ విషయానికొస్తే.. మధ్యతరగతి కుర్రాడు అజయ్. రోజురోజుకీ మారిపోతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవ‌డానికి, డ‌బ్బు, పేరు, ప్రేమ లాంటి వాటి గురించి తెలుసుకోవ‌డానికి ఇబ్బంది పడుతుంటాడు. అలా ఓ సమయంలో శ్వేత‌ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె డ్ర‌గ్స్‌కి బానిస అయిన మెడికో. అలాంటి ఆమెను సక్రమ మార్గంలో ఉంచటానికి చేసే ప్రయత్నాలు చేస్తూ.. బాహ్య ప్ర‌పంచంతో అజ‌య్ ఎలాంటి యుద్ధం సాగించాడ‌నేదే క‌థ‌.

(ఇదీ చదవండి: Prasanth Varma: 'హనుమాన్' మూవీతో హిట్‌ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement