సంక్రాంతికి దాదాపు నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏ సినిమాకు ఎప్పుడు వెళ్లాలా అని అందరూ ప్లాన్స్ వేసుకుంటున్నారు. మరోవైపు పండగ సీజన్‌ని క్యాష్ పలు చిన్న సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. కాకపోతే థియేటర్లు దొరికే ఛాన్స్ లేదు కాబట్టి ఓటీటీల వైపు చూస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ తెలుగు సినిమా నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయింది. ఇంతకీ ఏంటా మూవీ?
(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)
పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించిన అజయ్ కతుర్వర్.. బిగ్‌బాస్ ఓటీటీ షోతో కాస్తోకూస్తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ షోలో పాల్గొన్న తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. అలా చేసిన సినిమానే 'అజయ్ గాడు'. దాదాపు ఏడాదిన్నర క్రితమే అంతా రెడీ అయినప్పటికీ.. కారణం ఏంటో తెలీదు గానీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇన్నాళ్లకు ఈ సినిమాకు మోక్షం కలిగింది. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అజయ్, భానుశ్రీ, శ్వేత మెహతా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు టీమ్ ఏ దర్శకత్వం వహించాడు. చందన కొప్పిశెట్టితో కలిసి హీరో అజయ్ కతుర్వార్ స్వయంగా ఈ సినిమాని నిర్మించాడు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో పండగపూట థియేటర్లకు వెళ్లే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో కూర్చుని ఈ సినిమా ఫ్రీగా చూడొచ్చు.
(ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం)
Comments
Please login to add a commentAdd a comment