భానుశ్రీ
సినిమా: బ్రేకింగ్ న్యూస్‌తో నటి భానుశ్రీ హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో–2 ద్వారా పాపులర్ అయిన నటి అన్నది గమనార్హం. యువ నటుడు జై హీరోగా నటిస్తున్న చిత్రం బ్రేకింగ్ న్యూస్. నాగర్ కోవిల్‌కు చెందిన తిరుక్కడల్ ఉదయం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆండ్రూ పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విషయాలను నటి భానుశ్రీ తెలుపుతూ ఇందులో తాను నటుడు జైకు ప్రేయసిగా నటిస్తున్నానని చెప్పింది. ఆయన అమాయకత్వం చూసి ప్రేమలో పడతానని, అది పెళ్లికి దారి తీస్తుందని తెలిపింది. అయితే ఆ తరువాత ఈగో, విభేదాల కారణంగా విడిపోతామని చెప్పింది.
ఆరంభంలో తాను సంసారపక్షంగా ఉండే యువతిగా, చాలా చలాకీగా ఉంటానని, వివాహనంతరం సంప్రదాయ బద్ధంగా, ప్రశాంతంగా ఉండే అమ్మాయిగా మారిపోతానని చెప్పింది. తాము విడిపోవడానికి కారణం మాత్రం అడగకండి. ఎందుకంటే ఆ విషయాలను ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి చూస్తారు అని అంది. ఒక సాధారణ యువకుడు సమాజ శ్రేయస్సు కోసం సూపర్ హీరోగా మారే ఇతి వృత్తంతో సాగే చిత్రం బ్రేకింగ్ న్యూస్ అని చెప్పింది. ఇది ఫాంటసీతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. గ్రాఫిక్స్ ఉన్నా, ఇది గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రం కాదని, చాలా ఎమోషన్స్‌తో కూడిన కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది. నటుడు జై గురించి చెప్పాలంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైనా చాలా నిరాడంబరంగా ఉంటారని చెప్పింది. సహ నటీనటులకు ఎంతగానో సహకారం అందించే నటుడు జై అని పేర్కొంది. దర్శకుడు ఆండ్రూ పాండియన్ చాలా సమర్థుడని అంది. కథను చెప్పింది చెప్పినట్లు తెరకెక్కిస్తున్నారని తెలిపింది. చిత్ర షూటింగ్ ఇప్పటికే 15 రోజులు పూర్తి అయ్యిందని, షెడ్యూల్‌ను చెన్నైలో చిత్రీకరించబోతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. చిత్రంలో సీజీ వర్క్ 90 నిమిషాలు ఉంటుందని, అదేవిధంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ అధికంగా ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment