
కొత్త కోణంలో దావూద్ జీవితం
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘దావూద్’. స్వీయ దర్శకత్వంలో రాజేష్‌పుత్ర బేజం రూపొందిస్తున్న ఈ చిత్రంలో పండు ప్రియ, మయూరి, ఎస్.కె. నూర్, భానుశ్రీ ముఖ్య తారలు. ప్రచార చిత్రాలను విడుదల చేశారు. రాజేష్‌పుత్ర మాట్లాడుతూ - ‘‘దావూద్ పుట్టినప్పట్నుంచి ఇప్పటి విశేషాల వరకూ ఈ చిత్రంలో ఉంటాయి. ఆయన జీవితాల్లో కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రం ఇది. ఈ నెల 15న బీహార్‌లో మలి షెడ్యూల్ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: కాశీ విశ్వేశ్వరరావు.