‘‘ప్రతి ప్రేక్షకునికి రీచ్ అయ్యే టైటిల్ పెట్టడంలోనే సగం సక్సెస్ అయ్యారు. ఈ చిత్రం టీజర్ చూసినప్పుడే అండగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. నందు, శ్రీముఖి, కమల్ కామరాజు ముఖ్య తారలుగా వి.ఎస్. వాసు దర్శకత్వంలో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా సమర్పణలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన సినిమా ‘కుటుంబ కథా చిత్రమ్’.
ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నందు, కమల్ కామరాజు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ విడుదల చేయగా, టీజర్‌ని మల్కాపురం శివకుమార్ రిలీజ్ చేశారు. ‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తి చేసాం’’ అన్నారు భాస్కర్‌యాదవ్. ‘‘1980లో కుటుంబం అంటే అందరూ కలసి ఉండేవారు. 2017లో కుటుంబం అంటే ముగ్గురు లేక నలుగురే ఉంటున్నారు. ఈ చిత్రంలో 2017 జనరేషన్‌కు తగ్గట్టు కాన్సెప్ట్ ఉంటుంది’’ అన్నారు. నందు, కమల్ కామరాజు, కెమెరామెన్ మల్హర్ భట్ జోషి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment