నిత్య సినిమాలకు నో చెప్తోందా..? | Nitya Menon rejects Acting Offers | Sakshi
Sakshi News home page

నిత్య సినిమాలకు నో చెప్తోందా..?

Published Wed, Mar 22 2017 12:29 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

నిత్య సినిమాలకు నో చెప్తోందా..?

నిత్య సినిమాలకు నో చెప్తోందా..?

గ్లామర్ షోకు నో చెప్పినా.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న అతి కొద్ది మందిలో నిత్యామీనన్ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ మలయాళీ బ్యూటి. సినిమా రేంజ్తో సంబంధం లేకుండా తన పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ను బట్టే నిత్య సినిమాలు ఎంచుకునేది. తన నటనతో ఎన్నో సినిమాలకు ఘనవిజయాలు అందించిన నిత్యామీనన్, కొంత కాలంగా వెండితెర మీద కనిపించటం మానేసింది.

సందీప్ కిషన్ సరసన హీరోయిన్గా నటించిన 'ఒక అమ్మాయి తప్ప' సినిమా తరువాత నిత్యా మీనన్ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. అంతేకాదు కొంత మంది దర్శకులు నిత్యతో సినిమా చేసేందుకు సంప్రదించే ప్రయత్నం చేసినా.. ఆమె నో చెప్పేసిందిట. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న కారణంగానే నిత్యామీనన్కు సినిమాలు రావటం లేదన్న ప్రచారం జరుగుతున్నా.. అసలు కారణం వేరే ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్న నిత్యామీనన్, ఆ సినిమా పనులకు ఎక్కువ టైం ఇచ్చేందుకే వేరే ఆఫర్స్ను అంగీకరించటం లేదంటున్నారు. ప్రస్తుతానికి నిత్యామీనన్ దర్శకత్వం వహించబోయే సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. కెరీర్ మంచి ఫామ్లో ఉన్నఇలాంటి సమయంలో దర్శకత్వం వైపు అడుగులేయటం అంత కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు. మరి నిత్య నిజంగానే దర్శకత్వం కోసమే సినిమాలు కాదంటుందా.? అసలు విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement