
అందుకే నటించను
తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో నటించకపోవడానికి కారణాన్ని నటుడు ధనుష్ తెలిపారు. రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య తొలిసారిగా మెగాఫోన్ పట్టి తన భర్త ధనుష్ హీరోగా ‘3’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర నిర్మాణ దశలో మంచి బూమ్ తెచ్చుకున్నా విడుదలైన తరువాత ఆశించిన విజయం సాధించలేదు. అంతేకాదు ఇకపై తన భార్య దర్శకత్వంలో నటించనని ధనుష్ ప్రకటించా రు. ఆయన వ్యాఖ్యలపై మీడియా ఈకలు పీకడం మొదలెట్టింది. 3 చిత్రం విజయం సాధించనందువల్లే ధనుష్ అలాంటి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది.
మరోపక్క ఐశ్వర్య తన రెండవ చిత్రాన్ని వర్ధమాన నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా మొదలెట్టేశారు. ఇలాంటి పరిస్థితిలో ధనుష్ తన భార్య దర్శకత్వంలో నటించకపోవడానికి కారణం వెల్లడిస్తూ ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం హిట్ అయ్యిందా? ప్లాప్ అయ్యిందా? అన్నది సమస్య కాదన్నారు. ‘3’ చిత్రానికి తామిద్దరం పని చేసినపుడు అధిక సమయం షూటింగ్ స్పాట్‌లోనే ఉండేవారమన్నారు. దీంతో పిల్లలకోసం సమ యం కేటాయించలేని పరిస్థితి నెలకొందని చెప్పా రు. అందుకే ఎవరో ఒకరైనా పిల్లలతో ఉండాలని ఇద్దరం కలసి పనిచేయరాదని నిర్ణయించుకున్నామని వివరించారు.
ఇకపోతే రజనీకాంత్‌తో కలిసి నటిం చాలని ఆసక్తిగా ఉందని అలాంటి అవకాశం వస్తే చాలా సంతోషిస్తానన్నారు. ప్రస్తుతం హిందీలో షమితాబ్ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటిస్తున్నానని తెలిపారు. ఆయన చాలా ఫ్రెండ్లీగా నడుచుకుంటారన్నారు. ఆయన గొప్ప నటుడైనా తన పాత్ర విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పారు. అలాంటి గొప్ప నటుడిని ఇంతకుముందెప్పుడూ చూడలేదని ధనుష్ పేర్కొన్నారు.