Rajinikanth Daughter Aishwarya Rajinikanth Will Get Second Marriage, Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Aaishwarya Rajinikanth Second Marriage: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్‌..?

Published Tue, Jul 11 2023 9:35 AM | Last Updated on Tue, Jul 11 2023 10:21 AM

Aishwarya Rajinikanth Will Get Second Marriage - Sakshi

తమిళనటుడు ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ దంపతులు విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. కానీ మళ్లీ కొద్దిరోజుల కిందట విడాకులు రద్దు చేసుకుంటున్నారంటూ పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ వార్తలపై అటు ధనుష్‌ కానీ, ఇటు ఐశ్వర్య కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వీరిద్దరు మళ్లీ కలవడం అనేది అసాధ్యం అని అభిమానులు కామ్‌ అయిపోయారు.

(ఇదీ చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్‌)

తాజాగా ఐశ్వర్య రజనీకాంత్  రెండోపెళ్లి చేసుకోబోతున్నారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్థుతం ఆమె ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్‌గా ఉంటున్నారు. అంతే కాకుండా ఓ సినిమాకు డైరెక్షన్‌ కూడా చేస్తున్నారు. ఇలాంటి పుకార్లు రావడానికి ప్రధాన కారణం ఐశ్వర్యపై ఈమధ్య కోలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో ఆమె కనిపించిందని తెలుస్తోంది.

చెన్నైలోని ఓ రిసార్ట్‌లో అతడితో ఆమె సన్నిహితంగా మెలుగుతూ కనిపించడంతో ఈ రెండో పెళ్లిపై పుకార్లు బలంగా వ్యాపిస్తున్నాయి. ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియదు. ఇదే విషయంపై  ఐశ్వర్య రజనీకాంత్ స్పందిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లేదంటే ఇలాంటి పుకార్ల వల్ల ఇమేజ్‌ దెబ్బతింటుందని వారు తెలుపుతున్నారు.


ఎందుకు విడిపోయారు.. కారణం ఇదేనా?
కారణం ఏంటనేది ఇప్పటికీ పూర్తిగా బయటకు తెలియదు. తామిద్దరం విడిపోతున్నట్లు మొదట ఐశ్వర్య ప్రకటించగా తర్వాత ధనుష్ ప్రకటించారు. దీంతో అంతా అవాక్కయ్యారు.  కానీ సుచీ లీక్స్‌లో ధనుష్‌ ఫోటోలు బయటకు వచ్చినరోజు నుంచే వీరి మధ్య గొడవ స్టార్ట్‌ అయిందనే ప్రచారం ఉంది. ఆ తర్వాత ధనుష్‌ ఓ హీరోయిన్‌తో చనువుగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని, అందుకే ఐశ్వర్య విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిందనే టాక్‌ ఉంది. కోలీవుడ్‌లో ధనుష్‌కు ఉన్న ఎఫైర్‌ విషయంలో ఐశ్వర్య చాలా కాలంగా భరిస్తూ వచ్చి.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

(ఇదీ చదవండి: ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement