అన్నయ్య దర్శకత్వంలో తమ్ముడు? | Dhanush to team up with Selvaraghavan | Sakshi
Sakshi News home page

అన్నయ్య దర్శకత్వంలో తమ్ముడు?

Published Sun, Sep 21 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

అన్నయ్య దర్శకత్వంలో తమ్ముడు?

అన్నయ్య దర్శకత్వంలో తమ్ముడు?

ప్రముఖ యువ నటుడు ధనుష్‌కు తన అన్నయ్య సెల్వరాఘవన్ అంటే చాలా ఇష్టం. గౌరవం కూడా. ధనుష్ ప్రస్తుతం కథానాయకుడిగాను, నిర్మాతగాను విజయాల బాటలో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన తన ఉండర్ బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించి హీరోగా నటించిన వేలై ఇల్లా పట్టాదారి మంచి విజయాన్ని సాధించింది. అదే విధంగా సెల్వరాఘవన్‌కు ఈ మధ్య సరైన విజయాలు లేవు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఇరండామ్ ఉలగం చాలా నిరాశపరచింది.
 
 దీంతో ఆయన దర్శకత్వం వహించాల్సిన ఒకటి, రెండు చిత్రాలు డ్రాప్ అయ్యాయి. ఏదేమైనా ధనుష్ ఇప్పుడు తన అన్నయ్య దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా వార్త. ఇంతకుముందు కాదల్ కొండేన్, 7జి రెయిన్ బో కాలనీ, పుదుపేట్టై వంటి చిత్రాలకు సెల్వరాఘవన్‌తో పనిచేసిన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, ఛాయా గ్రాహకుడు అరవింద్ కృష్ణలు ఈ చిత్రానికి చేతులు కలపనున్నారని సమాచారం. ఈ బృందమే ధనుష్ ఉండర్‌బార్ ఫిలింస్ ద్వారా మళ్లీ త్వరలో రానున్నామంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement