
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’. తెలుగులో ‘యుగానికి ఒక్కడు’గా విడుదలైంది. కార్తీ, రీమాసేన్, ఆండ్రియా ముఖ్య పాత్రల్లో నటించారు. పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు దర్శకుడు సెల్వరాఘవన్. అయితే ఈ సినిమాలో ధనుశ్ హీరోగా నటించనున్నారు. 2024లో విడుదల కానుందట. ‘‘ఇదో భారీ చిత్రం. ప్రీ–ప్రొడక్షన్ పనులకే సుమారు ఏడాది సమయం పడుతుంది. సినిమా రావడానికి కాస్త టైమ్ పడుతుంది. కానీ అద్భుతమైన సినిమా అందిస్తాం’’ అన్నారు ధనుశ్.
Comments
Please login to add a commentAdd a comment